ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. చక్కెర కర్మాగారానికి పవర్​ కట్​

పర్యావరణ పరిరక్షణ పట్ల ఆలసత్వం వహించిన విశాఖ జిల్లాలోని గోవాడ చక్కెర కర్మాగారంపై కాలుష్య నియంత్రణ మండలి కొరడా ఝుళిపించింది. కర్మాగారాన్ని మూసివేయాలని అధికారులు ఆదేశించింది. ఈ విషయమై.. కర్మాగార యాజమాన్యం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటి)ను ఆశ్రయించింది. అక్కడ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆదేశాలు వెలువడిన ఫలితంగా.. కర్మాగారానికి విద్యుత్​ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

By

Published : Jul 15, 2020, 5:36 PM IST

Published : Jul 15, 2020, 5:36 PM IST

ETV Bharat / state

కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. చక్కెర కర్మాగారానికి పవర్​ కట్​

Pollution control board serious action
చక్కెర కర్మాగారానికి పవర్​ కట్​

కాలుష్యం నియంత్రణ చర్యలు చేపట్టని కర్మాగారాల పట్ల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కొరడా ఝళిపిస్తోంది. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించని విశాఖ జిల్లాలోని గోవాడ చక్కెర కర్మాగారం మూసివేయాలని మండలి ఆదేశించింది. కఠిన చర్యల అమలులో భాగంగా గోవాడ చక్కెర కర్మాగారానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలపై కర్మాగార యాజమాన్యం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటి)ను ఆశ్రయించింది. అక్కడ కూడా యాజమాన్యానికి చుక్కెదురైన కారణంగా.. ఈనెల 5 నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం కర్మాగారానికి విద్యుత్​ సరఫరా నిమిత్తం డీజిల్ జనరేటర్​ను వినియోగిస్తున్నారు. రోజుకు 8 గంటల పాటు జనరేటర్​ను వినియోగిస్తున్న కారణంగా.. రూ.30 వేల వరకు అధిక వ్యయమవుతోందని చక్కెర కర్మగారం యాజమాన్య సంచాలకుడు వి.సన్యాసినాయుడు తెలిపారు. 2016లో అప్పటి అధికారులు కాలుష్యం నియంత్రణపై, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు సకాలంలో దరఖాస్తు చేయలేదని, అన్ని సరిచేసి దరఖాస్తు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details