Police Vehicle Theft in Suryapet : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గత రాత్రి (టీఎస్ 09 పీఏ 0658) నంబర్ గల పట్టణ పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు అపహరించాడు. అనంతరం కోదాడలోని ఓ మద్యం దుకాణం ముందు నిలిపి పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులు చివరికి కోదాడలో వాహనం లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేటలో పోలీస్ వాహనం చోరీ కావడం ఇది రెండోసారి. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వీడెవడండి బాబు.. పోలీస్ వాహనాన్నే కొట్టేశాడు..! - పోలీస్ బండి దొంగతనం
Police Vehicle Theft in Suryapet : సాధారణంగా ఎవరైనా వాహనం పోగొట్టుకుంటే పోలీసులను ఆశ్రయిస్తారు. అదే పోలీసుల వాహనమే చోరీకి గురైతే..? పోలీసుల కళ్లు గప్పి.. ఓ ఘరానా దొంగ వారి వాహనాన్నే ఎత్తుకుపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
పోలీసు వాహనం చోరీ