ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగుల ఘాట్ రోడ్డు కూడలిలో గంజాయి పట్టివేత - మాడుగులలో గంజాయి పట్టివేత వార్తలు

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు కూడలిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. 12 కేజీల గంజాయి దొరికింది. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

madugula
మాడుగుల మండలం ఘాట్ రోడ్డులో గంజాయి పట్టివేత

By

Published : May 26, 2021, 10:38 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు కూడలిలో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. మన్యం ప్రాంతం నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఘాట్ రోడ్డు మీదుగా.. కారులో గంజాయి తరలిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారు వెనక్కి మళ్లించి వెళ్తుండగా వెంబడించి పట్టుకున్నారు. రెండు బస్తాల్లో ఉన్న 12 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నాడని ఎస్సై రామారావు చెప్పారు.

గంజాయి కారుకు దారి చూపిస్తున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి.. గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి.ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ABOUT THE AUTHOR

...view details