విశాఖ ఏజెన్సీలో సీఐ జి.బాబు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిపారు. జి.మాడుగుల ప్రాథమిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో కలిసి స్వచ్ఛభారత్ లో పాల్గొని, విధినిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. 1959లో ప్రాణ త్యాగం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మృతి చిహ్నంగా ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుగుతుందని సీఐ పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేంద్ర, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
జవాన్లకు నివాళిగా పోలీసులు స్వచ్ఛభారత్ - police Martyrs' Day at visakha agency news update
ప్రాణ త్యాగం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లకు స్మృతి చిహ్నంగా ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని విశాఖ ఏజెన్సీలో ఘనంగా నిర్వహించి, అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
పోలీసుల స్వచ్ఛభారత్