లేగదూడలను అక్రమంగా కబేళాకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముకుందపురం, రేగానిగూడెం మధ్యలో చెరువు వద్ద.. వందకుపైగా దూడలను కబేళాకు తీసుకెళ్లేందుకు కొందరు సిద్దమయ్యారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మూగజీవాలను స్వాధీనం చేసుకున్నారు.
సింహాచలం దేవస్థానానికి మొక్కుగా సమర్పించిన లేగదూడలను.. అక్రమంగా కబేళాకు తీసుకెళ్లడం దారుణమని గ్రామస్థులు వాపోయారు. భక్తి బావంతో స్వామివారి సన్నిధికి ఇచ్చిన లేగదూడల తరలింపును అరికట్టాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.