మావోయిస్టులు కంచుకోట గాలికొండ పంచాయతీలో పోలీసులు సామాజిక పోలీసింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలు మేరకు విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి మండలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గాలికొండ పంచాయతీ గడ్డిబందలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సతీష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ మన్యంలో గిరిజన గ్రామాలు అభివృద్ధే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని, తమ సిబ్బంది గ్రామ సందర్శనలో వెల్లువెత్తిన వినతుల మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.
గిరిపుత్రుల వెనకుబాటుకు మావోలే కారణం..
గాలికొండ రహదారి నిర్మాణం 20 సంవత్సరాలు సాగిందంటే కేవలం మావోయిస్టుల వల్లనేనని, మావోయిస్టులు మారుమూల ప్రాంతాలకు అభివృద్ధికి నిరోధకులుగా మారారని అభిప్రాయపడ్డారు. కానీ... ప్రజలు మార్పు కోరుకుంటున్నందున.. పోలీసు శాఖ దృష్టి పెట్టి త్వరితగతిన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు తెలిపారు. గాలికొండ మీదుగా పుట్టకోటకు కూడా రహదారి నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు రహదారులు నిర్మించడమేకాక.. సెల్ టవర్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగరనాయుడు మాట్లాడుతూ... గాలికొండ అనగానే చాలామందికి మావోయిస్టు గాలికొండ దళం గుర్తుకు వస్తుందని.. అటువంటి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధికి నిదర్శనంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. మావోయిస్టుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గిరిరక్షక మిత్ర ద్వారా యంత్రాల పంపిణీ..