విశాఖలో బీచ్ రోడ్డులో..... బైక్ రేసింగులతో రెచ్చిపోతున్న యువతకు పోలీసులు ముకుతాడు వేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలకు ఇబ్బందికరంగా మారిన రేసర్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా.. వారాంతాల్లో బీచ్ రోడ్డులో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. రేస్ బైక్ లపై వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా ప్రశ్నించారు. నెంబర్ బోర్డులేని వాహనాలతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారి వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.
బైక్ రేసింగులతో రెచ్చిపోతున్నవారికి ముక్కుతాడు - bike raceing at visakha beach road news update
సరికొత్త బైక్‌లపై వాయు వేగంతో దూసుకుపోయే కుర్ర కారు స్పీడుకి పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలకు ఇబ్బందికరంగా మారిన రేసర్లతోపాటుగా.. రేస్ బైక్‌లను అతివేగంగా నడిపే వారి కోసం పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
పోలీసుల స్పెషల్ డ్రైవ్
రెండు రోజుల వ్యవధిలో 2వందల 11 వాహనాలు స్వాధీనం చేసుకుని 220 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి...
అధికారులు విస్మరించారు.. గ్రామస్తులే ముందుకొచ్చారు!
Last Updated : Nov 24, 2020, 12:49 PM IST