Baby murder: చిన్నారి హత్యలో తల్లి పాత్ర లేదు: డీసీపీ ఐశ్వర్య రస్తోగి
14:22 June 05
ప్రియుడే హంతకుడు
విశాఖ జిల్లా మారికవలసలో.. చిన్నారి సింధుశ్రీ మృతి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి తల్లితో వివాహేతర సంబంధం ఉన్న జగదీశ్.. పాపను హత్య చేసినట్లు తేల్చారు. చిన్నారి హత్యలో తల్లి పాత్ర లేదని.. వరలక్ష్మి, జగదీశ్ మధ్య ఆర్థిక విభేదాలే హత్యకు కారణమని డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. సింధుశ్రీని చంపిన జగదీశ్.. అర్ధరాత్రి శ్మశానంలో అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి