పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి తరలించి విశాఖ జిల్లా నుర్మతి అవుట్ పోస్ట్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. జి.మాడుగుల మండలం సూరిమెట్ట గ్రామానికి చెందిన ముత్యాలమ్మ పురిటినొప్పులతో బాధపడుతోంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించడానికి వాహనాలు అందుబాటులో లేవు. వాహనం కోసం కుటుంబ సభ్యులు నుర్మతి సిగ్నల్ పాయింట్ వద్దకు వచ్చి వేచి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు విషయం తెలుసుకొని...,ప్రైవేటు జీపులో సూరిమెట్ట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అనంతరం అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. నుర్మతి చేరుకోగానే అంబులెన్స్ రావటంతో ఆమెను అందులో ఆసుపత్రికి తరలించారు. ఆపద సమయంలో ఆదుకున్న పోలీసులకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు...గర్భిణీ ఆసుపత్రికి తరలింపు - విశాఖ పోలీసుల మానవత్వం
లాఠీలు ఝుళిపిస్తూ కఠినంగా వ్యవహరించటమే కాదు...ఆపద సమయాల్లో మానవత్వాన్ని కూడా చాటుతామని నిరూపించారు విశాఖ మన్యం పోలీసులు. జి. మాడుగుల మండలం సూరిమెట్ట గ్రామంలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలించారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
TAGGED:
Pregnancy women in vishaka