విశాఖ జిల్లా సబ్బవరం భువనేశ్వరి దేవి ఆలయం రోడ్డు కూడలి వద్ద పోలీసులు తనీఖీలు నిర్వహించారు. 19 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. చోడవరం నుంచి సబ్బవరం మీదుగా రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి భయపడి వాహనాలు విడిచిపెట్టి పారిపోయారన్నారు.
సబ్బవరంలో 19 కిలోల గంజాయి పట్టివేత - Cannabis news in Sabbavaram, Visakhapatnam district
విశాఖ జిల్లా చోడవరం - సబ్బవరం మధ్య 19 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు అధికారులను చూసి పరారయ్యారు. వాహనాలను పరిశీలించగా ప్యాక్ చేసిన గంజాయి బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు.
![సబ్బవరంలో 19 కిలోల గంజాయి పట్టివేత సబ్బవరంలో 19 కిలో గంజాయి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9430245-993-9430245-1604493483023.jpg)
సబ్బవరంలో 19 కిలో గంజాయి పట్టివేత
ద్విచక్రవాహనాల్లో 19 కిలోల గంజాయి బయటపడిందని చెప్పారు. గంజాయితో సహా వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరోవైపు.. లైసెన్స్ లేకుండా మద్యాన్ని విక్రయిసున్న వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. ఆ వ్యక్తిని సబ్బవరం ప్రాంతానికి చెందిన నాగసూర్ అప్పారావుగా గుర్తించారు.
ఇవీ చదవండి: