విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అటుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వాహనం పై అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో సుమారు 922 కిలోల గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు కారకులైన.. ఒడిస్సాకు చెందిన నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
922 కిలోల గంజాయి పట్టివేత..
విశాఖ జిల్లా, పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. సుమారు 922 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
రూ. 30 లక్షల విలువ చేసే.. 922 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు