ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం - ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాల త‌యారీకి ఉప‌యోగించే లేత్‌మిష‌న్‌, గ్యాస్ వెల్డింగ్ సిలిండర్లు, లేత్ మిష‌న్ విడి భాగాలతో పాటు ఆయుధాలు, విప్ల‌వ ‌సాహిత్యం, ఇనుప తుక్కు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Police seize Maoist dump in aob
ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం

By

Published : Aug 24, 2020, 8:04 PM IST

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల‌కు అందిన నిర్దిష్ట‌మైన స‌మాచారం మేర‌కు స‌రిహ‌ద్దు భధ్ర‌తా బ‌ల‌గాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బ‌ల‌గాల నేతృత్వంలో ఏవోబీలోని క‌లిమెల పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని సూధికొండ స‌మీపంలో కురూబ్ అట‌వీ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించారు. ఆ సమయంలో మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ డంప్‌లో ఆయుధాల త‌యారీకి ఉప‌యోగించే లేత్‌మిష‌న్‌, గ్యాస్ వెల్డింగ్ సిలిండర్లు, లేత్ మిష‌న్ విడి భాగాలతో పాటు ఆయుధాలు, విప్ల‌వ ‌సాహిత్యం, ఇనుప తుక్కు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మ‌ల్క‌న్‌గిరి జిల్లా అద‌న‌పు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అట‌వీప్రాంతంలో క‌లిమెల ఏరియా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల స‌మావేశం నిర్వ‌హించార‌ని, ఈ మేర‌కు వ‌చ్చిన స‌మాచారంతో గాలింపులు నిర్వ‌హించామ‌ని, ఆ ప్ర‌దేశంలో మావోయిస్టులు ఆయుధాలు త‌యారు చేస్తున్న‌ట్లుగా నిర్ధరణ అయ్యింద‌ని ఆయ‌న తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details