విశాఖపట్నం జూపార్క్ వద్ద ఒంటరిగా తిరుగుతున్న 50 సంవత్సరాల వృద్దురాలిని గమనించిన నగర ఏడీసీపీ (అడ్మిన్) ఎమ్. రజనీ చలించిపోయారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ బంగారు పాపతో కలిసి వృద్ధురాలిని టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆశ్రయ నిరాశ్రయుల (మహిళల) వసతి గృహానికి తీసుకెళ్లారు.
వృద్దురాలికి భోజనం పెట్టించి ఆకలి తీర్చారు. నిత్యం విధి నిర్వహణలో తలమునకలై ఉండే తమకు ఇలాంటి సేవా కార్యక్రమాలల్లో పాలు పంచుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందని ఏడీసీపీ (అడ్మిన్) ఎమ్. రజనీ తెలిపారు.