ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Maoist: ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టు గణేశ్‌ కోసం గాలింపు - ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టు గణేశ్‌ కోసం గాలింపు న్యూస్

విశాఖ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అలియాస్‌ గణేశ్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సుమారు 600 మంది బలగాలతో ఏవోబీలో గస్తీ చేపట్టారు. అటు మావోయిస్టులు.., ఇటు పోలీసుల గాలింపుతో సరిహద్దు గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

police searching for Maoist Ganesh
ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టు గణేశ్‌ కోసం గాలింపు

By

Published : Jun 17, 2021, 8:34 PM IST

విశాఖ మన్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అలియాస్‌ గణేశ్‌ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. సుమారు 600 మంది బలగాలతో గస్తీ చేపట్టారు. దీంతో ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

అయితే ఈ ఎదురుకాల్పుల అనంతరం మావోయిస్టులు రెండు బృందాలుగా విడిపోయి తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తప్పించుకున్న ఒక బృందంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అలియాస్‌ గణేశ్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలోనే ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతంలో కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ రెండు సంఘటనలతో ఆంధ్రా - ఒడిశా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు రాష్ట్రాల నిఘా అధికారులు సమన్వయం చేసుకుంటూ భారీ ఎత్తున బలగాలను ఏవోబీలో మోహరించాయి. మరోవైపు నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ మృతదేహాలకు రేపు శవపరీక్ష జరపనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details