ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉత్తరాంధ్ర మోద కొండమ్మ జాతరకు పటిష్ఠ భద్రత'

పాడేరు శ్రీ మోద కొండమ్మ అమ్మవారి జాతరకు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ బాపూజీ తెలిపారు. మావో ప్రభావితం ప్రాంతం కావడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. సీసీ, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

By

Published : May 11, 2019, 6:18 AM IST

మోద కొండమ్మ జాతరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

మోద కొండమ్మ జాతరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
మోద కొండమ్మ జాతరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మోద కొండమ్మ అమ్మవారి మహోత్సవాలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ అట్టాడ బాపూజీ పోలీసు అధికారులతో సమీక్షించారు.

ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ఈ ఉత్సవాల్లో భద్రతకు సంబంధించి 8 డ్రోన్ కెమెరాలు, బాడీ సెక్యూరిటీ కెమెరాలు, సీసీ కెమెరాలు వాడనున్నట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రతకు గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ జిల్లా ప్రత్యేక బెటాలియన్ పోలీసులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మావోల సంచారం ఉందన్న సమాచారంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తున్నట్లు చెప్పారు.

లాడ్జిలలో పోలీసుల తనిఖీలు

మోద కొండమ్మ ఉత్సవాల్లో మావో యాక్షన్ టీమ్ సభ్యులు సంచరించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంత లాడ్జిలు, డార్మిటరీలలో బస చేసిన వారిలో అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. కొత్తవారు ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నట్లు గమనిస్తే సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. కొత్తవారికి వసతి కల్పిస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి : కరవుకు కేరాఫ్ గా కమలాపురం

ABOUT THE AUTHOR

...view details