విశాఖ మన్యం జీ. మాడుగుల మండలంలో పోలీసులు సోదాలు చేపట్టారు. మావోయిస్టు సానుభూతిపరులు సంచరిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. మండలంలోని నుర్మతి కూడలి, ఉరుము సెంటర్లలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందం అడుగడుగునూ క్షుణ్నంగా పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి, వారి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేశారు. కొత్తగా ఎవరైనా ప్రవేశిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్సై ఉపేంద్ర స్థానికులకు సూచించారు.
జీ. మాడుగులలో పోలీసుల సోదాలు - జీ మాడుగులలో పోలీసుల సోదాలు తాజా వార్తలు
మావోయిస్టు సానుభూతిపరులు సంచరిస్తున్నారన్న సమాచారంతో... విశాఖ మన్యం జీ. మాడుగులలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ప్రశ్నించి.. వారి బ్యాగులు తనిఖీ చేశారు. ఊర్లోకి కొత్తగా ఎవరైనా వస్తే వారి సమాచారం తెలపాలని స్థానికులకు సూచించారు.
జీ. మాడుగులలో పోలీసుల సోదాలు