ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో నాటుసారా స్థావరాలపై ఎక్సెైజ్ అధికారుల దాడులు - illegal liquor seized in manyam

విశాఖ మన్యంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. కొయ్యూరు, జి.మాడుగల, చింతపల్లి తదితర మండలాల్లో బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సారా అమ్మిన, తయారుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మన్యంలో నాటుసార స్థావరాలపై ఎక్సెైజ్ అధికారులు దాడులు
మన్యంలో నాటుసార స్థావరాలపై ఎక్సెైజ్ అధికారులు దాడులు

By

Published : Aug 14, 2020, 12:13 PM IST

విశాఖ మ‌న్యంలో నాటుసారా ఏరులై పారుతుంది. ఎక్సైజ్ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా సారా త‌యారీని నిలువ‌రించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా కొయ్యూరు. జి.మాడుగుల‌, చింతపల్లి , జీకే వీధి మండలాల్లో మారుమూల ప్రాంతాలలో నాటు సారా త‌యారీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. మరోపక్క ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తూ బెల్లం ఊటలను, నాటు సారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు, అయినప్పటికీ మద్యం తాగేవారు, మద్యం తయారు చేసేవారు ఎంత మాత్రం మారడం లేదు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీలో కుమ్మరు అంచుల గడ్డవాగు దగ్గర నాటుసారా త‌యారీ కేంద్రాల‌పై దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో సారా త‌యారీకు ఉప‌యోగించే 15 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేేశారు. 20 లీట‌ర్లు సారాను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి

చేయూత నగదు కోసం... భౌతిక దూరానికి దూరం!

ABOUT THE AUTHOR

...view details