ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - police rides on natusara centres

విశాఖ జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. 900 లీటర్ల పులుపు ధ్వంసం చేసి.. 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

vishaka district
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

By

Published : May 28, 2020, 6:49 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి శివారు సిరవరపు వారి కల్లాల సమీపంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్.ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో దాడులు చేశారు. నాటుసారా తయారికి ఉపయోగించే 900 లీటర్ల పులుపు పారబోశారు. 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details