విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలో శారదా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుబళ్లపై వాకపల్లి మార్గంలో అక్రమంగా తరలిస్తున్న మూడు బండ్లు, ఒక ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్.ఐ నరసింహమూర్తి చెప్పారు.
అక్రమ ఇసుక తరలింపుపై పోలీసుల కొరడా - విశాఖపట్నం జిల్లా నేటి వార్తలు
విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులు దాడులు చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుక వాహనాలు