ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి... నగదు, వాహనాలు స్వాధీనం - అనకాపల్లి పేకాట రాయుళ్ల న్యూస్​

విశాఖ జిల్లాలో పేకాట స్థావరంపై మునగపాక పోలీసులు దాడి చేశారు. 16 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

poker
పేకాట స్థావరంపై పోలీసుల దాడి ... నగదు , వాహనాలు స్వాధీనం

By

Published : Jan 3, 2021, 6:31 AM IST

విశాఖ జిల్లా మునగపాక మండలం కాకరపల్లి శివారులో రాత్రి వేళల్లో పేకాట ఆడుతున్న వారిని మునగపాక పోలీసులు పట్టుకున్నారు. గాజువాక నుంచి వచ్చిన 16 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 1, 57, 330 నగదు, రెండు కార్లు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు సహా 16 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు మునగపాక ఎస్సై బీ.శ్రీనివాసరావు తెలిపారు. దాడిలో అనకాపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్ సిబ్బంది, కశింకోట, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎస్సైలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details