తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఏవోబీలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పుల సంఘటన నుంచి మావోయిస్టు నాయకులు తప్పించుకుని ఏవోబీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలను అణువణువునా గాలిస్తున్నారు. ఈ మేరకు గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసు బలగాలు రంగలోకి దిగాయి.
AOB : ఏవోబీలో యుద్ధవాతావరణం.. మావోయిస్టు కదలికలతో పోలీసుల అప్రమత్తం - aob
తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. ఏవోబీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కోసం అణువణువుగా వెదుకుతున్నారు. గాలింపు చర్యల కోసం గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసులు రంగంలోకి దిగాయి.
మావోయిస్టుల కదలికలతో పోలీసుల అప్రమత్తం
ఒడిశాలోని డీవీఎఫ్, ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ బలగాలతో అటవీ ప్రాంతంలో వెదుకుతున్నారు. దీనికి తోడు ఏవోబీలో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకోవడంతో పాటు మావోయిస్టుల కార్యకలాపాలు విస్తృతం చేసే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో సరిహద్దు కూడలి గ్రామాల్లో విస్తృత గాలింపు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి :