ఇంటి నుంచి బయటకు రావద్దని పలుమార్లు హెచ్చరించినా వినకుండా పార్కుల్లో వాకింగ్ చేసేందుకు వచ్చిన విశాఖ జిల్లా భీమిలి వాసులను పోలీసులు దండించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. యువకులను మాత్రం భీమిలిలోని గాంధీ కళ్యాణమండపానికి తరలించారు. కరోనా నేపథ్యంలో వాకింగ్ కోసం బయటకు వస్తే ప్రాణాలకు ముప్పు వస్తుందని ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ లాక్డౌన్ కొనసాగినంత కాలం ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని హెచ్చరించారు.
ఇకపై బయటకొస్తే... నేరుగా క్వారంటైన్కే! - ap corona live updates
లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వాకింగ్ చేస్తున్న వారికి భీమిలి పోలీసులు వినూత్న దండన విధించారు. భీమిలి మండలం తగరపువలస ప్రాంతంలో కోటప్పకొండ పార్క్‌లో ఉదయం ఎక్కువ మంది ఒకేసారి వాకింగ్ చేయటంపై వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇకపై బయటకొస్తే డైరెక్ట్ క్వారంటైనే!