ఆన్లైన్ రుణం నిర్వాహకుల వేధింపులు తాళలేక నవంబర్ ముడో తేదీన విశాఖలో ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలి తల్లి ఉషామణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు... ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పుణె కు పంపారు. లోన్ రికవరీ ఏజెంట్ గౌతం మూలేను అదుపులోకి తీసుకుని, స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు క్రైమ్ డీసీపీ వి.సురేష్ బాబు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలతో విశాఖకు తీసుకువచ్చి మూడో ఏసీఎమ్ఎమ్ కోర్టులో హాజరు పరచినట్లు వివరించారు. ఈ కేసులో మరో ముగ్గుర్ని అరెస్ట్ చేయాల్సి ఉందని.. ఆన్లైన్లో రుణం ఇచ్చే యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.
విశాఖ : యువతి ఆత్మహత్య కేసులో పోలీసుల పురోగతి - విశాఖలో యువతి ఆత్మహత్య కేసులో పురోగతి
గతేడాది నవంబర్‌లో విశాఖలో ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆన్లైన్ లోన్ రికవరీ ఏజెంటును అదుపులోకి తీసుకుని విశాఖ మూడో ఏసీఎమ్ఎమ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరో ముగ్గుర్ని అరెస్టు చేయాల్సి ఉందని డీసీపీ వి.సురేశ్ బాబు తెలిపారు.
యువతి ఆత్మహత్య కేసులో పోలీసుల పురోగతి