ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లు..ఆచూకీ తెలిపితే పారితోషికం - latest news in vishaka district

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు ప్రాంతంలో మావోయిస్టుల ఫోటోలు కలిగిన పోస్టర్లను పోలీసులు అంటించారు. వారందరిని సంఘ విద్రోహులుగా పేర్కొంటూ..ఆచూకీ తెలిసినవారికి పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

posters with photos of Maoists
మావోయిస్ట్​ల ఫోటోలతో పోస్టర్లు

By

Published : Apr 17, 2021, 7:20 PM IST

విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం మద్దిగరువు ప్రాంతంలో పోలీసులు.. మావోయిస్టు దళ సభ్యులు, వారి సానుభూతిపరుల ఫోటోలను పోస్టర్ల రూపంలో అతికించారు. అందులో 25 మంది అనుమానితుల ఫోటోల వివరాలను జత చేశారు. జి. మాడుగుల మండలం మారుమూల మద్దిగరువు, బోయితలి, నుర్మతి ప్రాంతాల్లో వీటిని అతికించారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు మావోయిస్టు పార్టీలో చేరి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారి ఆచూకీ తెలిసినవారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోస్టర్లలో జిల్లా ఎస్పీ, నర్సీపట్నం ఓఎస్డీ, పాడేరు, చింతపల్లి డీఎస్పీల ఫోన్ నెంబర్లను పొందుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details