ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు జిల్లా ఆసుపత్రిలో పోలీసు అవుట్ పోస్ట్ - పాడేరు జిల్లా ఆసుపత్రిలో పోలీసు అవుట్ పోస్టు

విశాఖ మన్యం కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రిలో పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. వైద్యులు.. సిబ్బందిపై దాడులు జరుగుతున్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Police outpost  at Paderu District Hospital
పాడేరు జిల్లా ఆసుపత్రిలో పోలీసు అవుట్ పోస్టు

By

Published : Dec 5, 2020, 12:20 PM IST

వైద్యులపై జరుగుతున్న దాడుల పట్ల విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రెండు రోజుల కిందట విధుల్లో ఉన్న ఓ వైద్యుడిపై ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించి చెప్పుతో కొట్టాడు. ఆగ్రహించిన వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు.

రోగుల బంధువులు దాడులు చేయడంతో తమ విధులకు ఆటంకం కలుగుతోందని.. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు ప్రవేశ మార్గం వద్ద ఔట్ పోస్ట్ రూమ్ కేటాయించారు. వైద్య విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details