గోపాలపట్నంలో దొంగల హల్చల్... పోలీసుల పై ఎదురుదాడి THIEVES ATTACK ON POLICE: విశాఖ జిల్లా గోపాలపట్నంలో నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పట్టుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై తిరగబడ్డారు. చివరకు స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలు కాగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు.
అసలు ఏం జరిగిందంటే...
సింహాచలం నుంచి వస్తున్న ఆటోను విరాట్ నగర్లో నలుగురు వ్యక్తులు ఆపి ఎక్కారు. గోపాలపట్నం బంక్ దగ్గరికి రాగానే ఆటోలోని వ్యక్తులు కత్తులు బయటకు తీసి.. ఆటో డ్రైవర్ను బెదిరించి అతని మెడలోని గొలుసు తీసుకుని అతడిని బయటకు తోసేశారు. అనంతరం అక్కడినుంచి ఆటో తీసుకుని పరారయ్యారు. కొంత దూరం వెళ్లాక అక్కడ ఆటోను వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బాజీ జంక్షన్లో నిందితులను గుర్తించి.. పట్టుకోవటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తమపై ఎదురుదాడికి దిగారని.. స్థానికుల సహాయంతో నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు గంజాయి మత్తులో ఉన్నారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
Dr. Sudhakar case: నేరస్థులను రక్షించాలనుకుంటున్నారా.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న