విశాఖ జిల్లా పాడేరు మన్యం ప్రాంతంలో గిరిజనుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుత్తేదారు నిర్లక్యం కారణంగా ముంచంగిపుట్టు మండలంలోని గెంజిగెడ్డ వంతెన నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన మళ్లింపు రహదారి కొట్టుకుపోయింది. ఫలితంగా ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 80 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. స్పందించిన పాడేరు సీఐ ప్రేమకుమార్, ఎస్సై ప్రసాద్... స్థానిక ఆటో, జీపు డ్రైవర్ల సహకారంతో రహదారికి మరమ్మతులు చేశారు. ఫలితంగా... రాకపోకలకు మళ్లీ దారి అనుకూలంగా మారింది. పోలీసులు చొరవ పట్ల 2 మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుత్తేదారు నిర్లక్యం... పోలీసుల శ్రమదానం..!! - visakha police
విశాఖ జిల్లా పాడేరు మన్యంలో గుత్తేదారు నిర్లక్యం కారణంగా రహదారి పనులు నిలిచిపోయాయి. ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడ్డారు. ప్రజల కష్టాలను గుర్తించిన స్థానిక పోలీసులు... ఆటో, జీపు డ్రైవర్ల సహకారంతో... రహదారికి మరమ్మతు చేశారు.

గుత్తేదారు నిర్లక్యం... పోలీసుల శ్రమదానం
గుత్తేదారు నిర్లక్యం... పోలీసుల శ్రమదానం