ఛలో ఆత్మకూరు నేపథ్యంలో... విశాఖ జిల్లా అనకాపల్లి తెదేపా నాయకులను పట్టణ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పార్టీ అనకాపల్లి పట్టణ అధ్యక్షులు నారాయణరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలను తెదేపా కార్యాలయం నుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారు. పోలీసుల వ్యవహార శైలిపై తెదేపా నాయకులు నిరసన తెలిపారు.
విశాఖలో తెదేపా కార్యకర్తల హౌజ్ అరెస్టు - హౌస్ అరెస్టు
విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో ఆత్మకూరు నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టగా అదుపులోకి తీసుకున్నారు.
తెదేపా కార్యకర్తలను..హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు