ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్.ఆర్.వెంకటాపురంలో పోలీసు బందోబస్తు - ఆర్.ఆర్.వెంకటాపురం లో పోలీసుల పహారా

విశాఖ ఎల్​.జీ పాలిమర్స్ వద్ద నిరసనలతో ఆర్.ఆర్.వెంకటాపురంలో అధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రజలెవరూ ఉండకూడదని.. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.

Police high security in RR Venkatapuram about lg polymers protest in vishakhapatnam
ఆర్.ఆర్.వెంకటాపురంలో పోలీసు బందోబస్తు

By

Published : May 9, 2020, 8:25 PM IST

Updated : May 9, 2020, 8:49 PM IST

విశాఖపట్నంలోని ఎల్.జీ పాలిమర్స్ గేట్ వద్ద నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్.ఆర్. వెంకటాపురంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపట్నం నుంచి గ్రామానికి రాకపోకలను నిషేధించారు.

గ్రామంలో ప్రజలెవరూ ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమ గేట్ వద్ద కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. గ్రామంలో పరిస్థితిని డీసీపీ ఉదయ్ కుమార్ బిర్లా సమీక్షిస్తున్నారు.

Last Updated : May 9, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details