విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ వెంకటేశ్వరావుకు... మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కనిపించాడు. చలించిన కానిస్టేబుల్.. అతనికి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు తొడిగాడు. విచారించగా ఆ వ్యక్తి పేరు గురప్ప అని.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందినవాడని తెలిపాడు. ఆ వ్యక్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రానికి తరలించిన కానిస్టేబుల్.. బాధితుని బంధువులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కలవాలని కోరాడు.
కానిస్టేబుల్ ఔదార్యం.. మతిస్థిమితం లేని వ్యక్తికి సహాయం - అక్కయ్యపాలెంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
మతిస్థిమితం లేని ఓ వ్యక్తి... లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తోన్న కానిస్టేబుల్కి కనిపించాడు. చలించిన కానిస్టేబుల్ ఆ వ్యక్తిని నిరాశ్రయుల కేంద్రానికి తరలించాడు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో జరిగిన ఘటన వివరాలివి..!
మతిస్థిమితం లేని వ్యక్తి: మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్