ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యం పట్టివేత.. నిందితులు అరెస్ట్ - కడపలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం

పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.

రేషన్ బియ్యం
smuggled ration rice

By

Published : Jun 9, 2021, 9:04 AM IST

విశాఖ జిల్లా పెందుర్తిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గాజువాకకు చెందిన చూసుకొండ నాగ అప్పారావు.. ఆటోలో గోపాలపట్నం నుంచి సబ్బవరానికి బియ్యాన్ని తరలిస్తుండగా నరవలో పోలీసులు పట్టుకున్నారు. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి సబ్బవరానికి తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. గొట్టివాడ దరి బియ్యం మిల్లులో పాలిష్ చేసి తిరిగి విక్రయిస్తామని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్ పేటలో 117వ చౌక దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో డీలర్​ని అరెస్ట్ చేసి.. 30 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details