ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

350 కిలోల గంజాయి పట్టివేత... సరుకు విలువ రూ.కోటిన్నర? - విశాఖపట్నం తాజా న్యూస్

లగేజ్ వ్యాన్లో తరలిస్తున్న 350 కిలోల గంజాయిని విశాఖ జిల్లా మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి గంజాయితో పాటు లగేజ్ వ్యాన్, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

Police have nabbed a smuggler of cannabis at Marripalem check post in Kollur zone of Visakhapatnam district
350 కిలోల గంజాయి పట్టివేత... లగేజ్ వ్యాన్, రెండు సెల్​ఫోన్​లు స్వాధీనం

By

Published : Mar 11, 2021, 10:48 AM IST

విశాఖ జిల్లా కొల్లూరు మండలం మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద.. లగేజ్ వ్యాన్లో తరలిస్తున్న 350 కిలోల గంజాయిని నర్సీపట్నం స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు కోటి యాభై లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

వీరి నుంచి గంజాయితో పాటు లగేజ్ వ్యాన్, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలించిన గొలుగొండ మండలం చోద్యం గ్రామానికి చెందిన కోళ్ల రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details