ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టర్కీలో రద్దైన కరెన్సీ విశాఖలో ప్రత్యక్షం...ముఠా అరెస్టు - vizag latest crime news

టర్కీ ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీని విశాఖలో మార్చేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నోట్లను ఎక్కువ మొత్తాలకు అమాయకులకు అంటగట్టేందుకు ముఠా ప్రణాళికలు రచిస్తుండగా పోలీసులు పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు.

turkey currency
turkey currency

By

Published : Dec 2, 2020, 8:50 PM IST

కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

చెల్లని టర్కీ కరెన్సీ నోట్లను విశాఖలో మార్చేందుకు యత్నిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చెల్లని 300 టర్కీ కరెన్సీ నోట్లు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా ఏసీపీ ఆర్​వీఎన్ఎన్ మూర్తి కేసు వివరాలను వెల్లడించారు.

విశాఖలోని కృష్ణా కళాశాల సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తుల వద్ద 300 టర్కీ చెల్లని నోట్లను పోలీసులు గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ నోట్లను ఎక్కువ మొత్తాలకు అమాయకులకు అంటగట్టేందుకు ముఠా యత్నిస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. బుజ్జల రామస్వామి, నాంబారి నారాయణరావు, దమ్మేటి సత్య వెంకట ప్రసాద్, దలాలి యశోద, ఇందిలా పృథ్వీరాజ్, మువ్వల ప్రసాద్​లపై ఎంవీపీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కీలక సూత్రధారి పరారీలో ఉన్నట్టు ఏసీపీ మూర్తి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details