పోలీసుల దాతృత్వం... విశాఖ ఏజెన్సీలో నిత్యావసరాలు పంపిణీ - lock down in agenvy vishakha
లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న విశాఖ ఏజెన్సీ గిరిజనులకు సాయంగా మేమున్నాం అంటూ పోలీసులు నిత్యావసరాలు అందించారు.
పోలీసుల దాతృత్వం... విశాఖ ఏజెన్సీలో నిత్యావసరాలు పంపిణీ
విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలం రూడకోటలో పోలీసులు గిరిజనుల ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ బాబూజీ ఆదేశాలతో పాడేరు సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజారావులు వాహనాల ద్వారా... కొత్త రూడకోట, రూడకోట, సంతబయలు, కుమ్మరవీధి, చిన్న సరియపల్లి, జీలుగులపుట్, కాండ్రంగి వలస గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.