ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం.. - missing boy news

విశాఖలో ఇటీవల తప్పిపోయిన బాలుడి ఆచూకీ పోలీసులు కనిపెట్టారు. జిల్లాలోని కె.కోటపాడు మండలం ఏ.కోడూరు పోలీసులు.. పిల్లాడిని గుర్తించి బంధువులకు అప్పగించారు.

Police cracking case of missing boy
బాలుడిని బంధువులకు అప్పగించిన పోలీసులు

By

Published : Mar 29, 2021, 12:03 PM IST

ఇటీవల తప్పిపోయిన బాలుడి ఆచూకీ విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఏ.కోడూరు పోలీసులకు లభ్యమైంది. పిల్లాడిని సురక్షితంగా వారి బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది

అనకాపల్లి మండలం సత్యనారాయణపురానికి చెందిన 11 ఏళ్ల బాలుడు ఈనెల 26న తప్పిపోయాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి.. ఇంటి నుంచి బయలుదేరిన బాలుడు.. బంధువుల ఇళ్లు చేరలేదు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆచూకీ కనుగొనే క్రమంలో వాహనాల తనిఖీ చేపట్టగా.. బాలుడు దొరికాడు. పిల్లాడి బంధువులకు సమాచారం అందించి.. వారికి అప్పగించినట్లు ఎ.కోడూరు ఎస్సై అప్పలనాయుడు చెప్పారు.

ఇదీ చదవండి:ఇదేమి చోద్యం... బియ్యం బండిలో ప్రయాణికుల రవాణా !

ABOUT THE AUTHOR

...view details