ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో మావోయిస్టుల బంద్... పోలీసుల అప్రమత్తం - విశాఖ జిల్లా వార్తలు

ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్​కౌంటర్లుకు నిరసనగా మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Maoist bandh in andhra Odisha Border
ఏవోబీలో పోలీసుల విస్తృత తనిఖీలు

By

Published : Dec 21, 2020, 12:21 PM IST

ఆంధ్రా - ఒడిస్సా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల బంద్ నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. స‌రిహ‌ద్దు కూడ‌లిలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 25న‌, డిసెంబ‌ర్ 12న ఏవోబీలో జ‌రిగిన బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లుకు నిరస‌న‌గా మావోయిస్టులు ఏవోబీలో బంద్‌కు పిలుపునిచ్చారు. మావోయిస్టులు ప్ర‌తీకార దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో స‌రిహ‌ద్దుల్లో భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రిం‌చారు. గ‌త రాత్రి నుంచే ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు.

రెండు రోజులు ముందు నుంచే మావోయిస్టులు బంద్‌పై విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎన్‌కౌంట‌ర్‌కు నిర‌స‌న‌గా దాడులకు పాల్ప‌డే అవ‌కాశముంద‌ని భావించిన పోలీసులు ముందుజాగ్ర‌త్త‌గా త‌నిఖీలు చేపట్టారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ప్ర‌త్యేక బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. మ‌న్యంలో ర‌హ‌దారి నిర్మాణాలు చేప‌డుతున్న యంత్రాల‌ను ఇప్ప‌టికే సంబంధిత పోలీసుస్టేష‌న్‌ల‌కు త‌ర‌లించారు. బంద్ సంద‌ర్బ‌ంగా సోమ‌వారం ఉద‌యం నుంచి స‌రిహ‌ద్దుల్లో రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details