విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మైదాన ప్రాంతాల్లో ఇటీవల చాలా చోట్ల గంజాయి పట్టుబడింది. పాడేరు విశాఖకు ప్రధాన రహదారైనా ఘాట్ రోడ్డులో పోలీసులు ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు. అనుమానిత యువకులను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మన్యంలో మావోయిస్టు మిలీషియా సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో...పోలీసులు గస్తీ పెంచారు. వాహనాలతో పాటు వారి బ్యాగులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులు ఎవరైనా సంచరించినట్లైతే తమకు సమాచారం ఇవ్వాలని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ ప్రకటించారు.
పాడేరు ఘాట్ రోడ్డులో పోలీసుల తనిఖీలు ముమ్మరం - పాడేరు ఘాట్ రోడ్డులో పోలీసు తనిఖీలు వార్తలు
విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మైదాన ప్రాంతాల్లో ఇటీవల చాలా చోట్ల గంజాయి పట్టుబడింది. మన్యంలో మిలీషియా సభ్యులు సంచరిస్తున్నారని పోలీసులు గస్తీ పెంచారు.
పాడేరు ఘాట్ రోడ్డులో పోలీసు తనిఖీలు ముమ్మరం