విశాఖ జిల్లా చోడవరంలో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తవుడు లోడుతో పాడేరు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వ్యాన్లో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తవుడు బస్తాల మధ్యలో గంజాయి మూటలు ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్కు తరలించారు.
రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం - చోడవరంలో తవుడు బస్తాల మాటున తరలిస్తున్న గంజాయి స్వాధీనం
తవుడు బస్తాల మధ్య గంజాయి మూటలు తరలిస్తున్న ఓ వ్యాన్ను విశాఖ జిల్లా చోడవరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించగా.. రూ. కోటి విలువైన సరుకు పట్టుకున్నట్లు తెలిపారు.

చోడవరంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం