విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనలో ఆందోళన చేసిన పలువురు బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. డీజీపీ గౌతం సవాంగ్ విశాఖ వచ్చినరోజు అడ్డుకున్న, నిరసన తెలిపిన 50 మందిపై కేసులు పెట్టినట్లు గోపాలపట్నం సీఐ రమణయ్య తెలిపారు.
డీజీపీని అడ్డుకున్న విశాఖ బాధితులపై కేసులు నమోదు - విశాఖ గ్యాస్ లీక్ తాజా వార్తలు
విశాఖలో డీజీపీని అడ్డుకున్న గ్యాస్ లీకేజి బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో నష్టపోయి ఆక్రోశంతో, ఆవేదనతో డీజీపీ గౌతం సవాంగ్‌ను ప్రశ్నించిన సుమారు 50 మందిపై కేసులు పెట్టినట్లు గోపాలపట్నం సీఐ రమణయ్య తెలిపారు.
డీజీపీని అడ్డుకున్న విశాఖ గ్యాస్ బాధితులపై కేసులు నమోదు
ఘటనలో మృతిచెందిన గ్రీష్మ అనే బాలిక తల్లిపై కేసు నమోదు చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. ఆ రోజు ఆమె తన పాపను తెచ్చివ్వండంటూ డీజీపీని నిలదీశారు.
ఇవీ చదవండి... 'అన్ని సౌకర్యాలతో నిద్రపోతే సమస్య పరిష్కారం అయినట్లు కాదు'