కొవిడ్ మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని గత కొద్దిరోజులుగా విశాఖలో పోలీసులు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం నగరంలోని ప్రధాన కూడళ్లలో నగర క్రైమ్ డీసీపీ సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారులను ఆపి ఈ-చలాన్ ద్వారా వారికి జరిమానా విధించారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
'కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' - vizag latest news
విశాఖ నగరంలో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తి కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరుతున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
విశాఖలో కరోనా నిబంధనలపై అవగాహన