విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహిస్తున్న కోడిపందేలపై అనకాపల్లి గ్రామీణ పోలీసులు దాడులు చేశారు. మండలంలోని వెంకుపాలెంలో కోడిపందేలు ఆడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు అనకాపల్లి గ్రామీణ ఎస్సై ఈశ్వర్ రావు తెలిపారు. వారి నుంచి నాలుగు కోళ్ళు, 9300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోపాలపురం శివారులో కోడి పందేల స్థావరాలపై దాడి చేసి పది మందిపై కేసు నమోదు చేశారు. నాలుగు కోళ్ళు, 4,400 నగదు స్వాధీనం పరుచుకున్నట్లు గ్రామీణ ఎస్సై వెల్లడించారు.
కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి..పలువురిపై కేసులు - hen fighting at visakha district news update
విశాఖ జిల్లా అనకాపల్లిలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పలువురిపై కేసులు నమోదు చేసి, వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు
ఇవీ చూడండి...