ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పించుకున్న గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు - sabbavaram latest news

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

chodavaram police
chodavaram police

By

Published : May 30, 2021, 8:22 AM IST

Updated : May 30, 2021, 7:06 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో తప్పించుకున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండలంలో నిన్న ఉదయం… మామిడి పళ్ల వ్యాన్​లో గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిద్దరూ పోలీస్​ స్టేషన్​ నుంచి తప్పించుకుని పరారయ్యారు.

వెంటనే అప్రమత్తమైన స్థానిక ఎస్సై చంద్రశేఖర్ రావు మరో ఎస్సై సతీష్​, స్థానిక రైతుల సహకారంతో తవ్వవానిపాలెం పొలాల్లో… నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు… బిహార్​కు చెందిన నందకిషోర్​, జాన్​ కుమార్​గా గుర్తించామని చెప్పారు.

Last Updated : May 30, 2021, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details