విశాఖ జిల్లా చింతపల్లి సమీపంలోని అంతర్ల వద్ద పోలీసులు 90 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మాడెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రెండు ఆటోల్లో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ నిందితుల్లో ఇద్దరు బాలలు ఉన్నారని, వీరిని బాలనేరస్థుల పాఠశాలకు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఆటోలను సీజ్ చేశామని చింతపల్లి ఎస్సై ఆలీ పేర్కొన్నారు.
గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులు...90 కిలోలు స్వాధీనం - viskaha ganja taja transport news
విశాఖ జిల్లా చింతపల్లి సమీపంలోని అంతర్ల వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 90 కిలోల గంజాయి పట్టుబడింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని చింతపల్లి ఎస్సై ఆలీ తెలిపారు.
police arrested the persons who transport ganja illegal transport in visakha dst