Theft Case at MVP Colony: విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-1లో చోరీ కేసులో నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగరంలో శుక్రవారం రాత్రి వెల్డింగ్ సామాగ్రి విక్రయించే వ్యాపారి అశోక్ కుమార్ నివాసంలో నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు. కుటుంబ సభ్యులను బెదిరించి బంగారం, వెండి ఆభరణాలు, ఖరీదైన వాచ్‌లు, ఫోన్లతో పాటు కొంత నగదు దొంగలించి అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుని కుమారుడు వెంటనే పోలీసులకు చోరీపై సమాచారమివ్వడంతో.. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు బాధితుని కుమారుడి దుకాణం, నివాసంలో పనిచేసినట్లు గుర్తించారు.
అన్నం పెట్టిన ఇంటికే.. కన్నమేశారు..! గంటల్లోనే పట్టుకున్న పోలీసులు - visakhapatnam news
Theft Case at MVP Colony: కొంత కాలం క్రితం పనిలో చేరాడు. ఇంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకున్నాడు. తరువాత పని మానేసి.. అదే ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. ఇంట్లో వాళ్లను బెదిరించి.. విలువైన వస్తువులతో ఉడాయించాడు. కానీ.. తెల్లారేసరికి పోలీసులు అదుపులో ఉన్నాడు. విశాఖలో జరిగిన ఈ చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేదించారు.
చోరీ కేసు