ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో ఎన్నికల ప్రక్రియ.. డ్రోన్లతో పోలీసుల పహారా - విశాఖ మన్యం వార్తలు

విశాఖ మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్​లలో ఎలాంటి అవాంతరాలు రాకుండా డ్రోన్​ల సహాయంతో పహారా కాస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగడానికి పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

police alert on visakha agency
డ్రోన్లతో పోలీసుల పహారా

By

Published : Feb 6, 2021, 5:43 PM IST

విశాఖ మన్యంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగడానికి పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముంచంగిపుట్టు పరిధిలో ఎన్నికల అవాంతరాలు రాకుండా డ్రోన్​ల సహాయంతో పహారా కాస్తున్నారు. మండలంలోని రంగబయలు, బంగాపుట్, వణుగుమ్మ, బూసిపుట్టు తదితర మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న పంచాయతీల నామినేషన్​లను లక్మీపురం, బరడా పంచాయతీ కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు డ్రోన్​ల నిఘా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. పరిస్థితులను ముంచంగిపుట్టు ఎస్సై ప్రసాద్ రావు పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details