ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి పీఎల్​జీఏ వారోత్సవాలు.. మన్యంలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు - విశాఖ మన్యంలో పోలీసులు అలర్ట్ తాజా వార్తలు

విశాఖ మన్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ పీఎల్​జీఏ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా పలు చోట్లు పోస్టర్లు వెలశాయి. యువత పెద్ద ఎత్తున పీఎల్​జీఏలో చేరాలని, శత్రువులకు బానిసలు కావద్దని ఆ పోస్టర్లలో ఉంది.

Police alert on Maoist party plga farmation day
మావోయిస్టుల వారోత్సవాలు విశాఖ మన్యంలో పోలీసులు అలర్ట్

By

Published : Dec 2, 2020, 9:52 AM IST

సీపీఐ మావోయిస్టు పార్టీ పీఎల్​జీఏ 20వ ఆవిర్భావ వారోత్సవాలు నేటి నుంచి వారం పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. యువత పెద్ద ఎత్తున పీఎల్​జీఏ​లో చేరాలని.. శత్రువుల మాటలు నమ్మి బానిసలు కావద్దని ఆ పోస్టర్లలో ఉంది.

పోలీసులు వారోత్సవాలపై అప్రమత్తమయ్యారు. సరిహద్దులోని పోలీస్ స్టేషన్లలో జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాజకీయ నాయకులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పాడేరు పరిధిలో సంచరించిన మావోయిస్టుల సమాచారంపై ఆరా తీశారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తున్నారేమో అన్న అనుమానంతో సోదాలు నిర్వహించారు. గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గిరిజనులతో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న ఊహాగానాలపై.. పోలీసులు దృష్టి పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details