విశాఖ ఏజెన్సీలో చట్ట వ్యతిరేక శక్తులకు లొంగకుండా ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ కోరారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ప్రజలు బహిష్కరించాలి అంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ఎన్నికల ఆటంకం కలిగించకుండా విస్తృతంగా కూంబింగ్ చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. 1400 మంది సాయుధ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని.. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టమన్నారు. మండల కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక మొబైల్ టీం ఉంటుందని అన్నారు. ప్రజలు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మావోయిస్టుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు - విశాఖ ఏజెన్సీలో పోలీసుల సోదాలు
విశాఖ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో ఎస్ఈబీ అదనపు ఎస్పీ చెక్‌పోస్టుల వద్ద సోదాలు చేశారు.
మావోయిస్టుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు
విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎస్ఈబీ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తనిఖీలు చేశారు. అక్రమంగా మద్యం రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నగదను తరిలిస్తే వాటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
ఇదీ చూడండి.ఆ గ్రామాల్లో భేషుగ్గా సమాచార స్రవంతి