విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు, తంగుడుబిల్లి గ్రామాల సరిహద్దులో జీడిమామిడి తోటల్లో నాటుసారా తయారీ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1000 లీటర్ల బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేసినట్లు ఎస్ఐ సురేశ్‌కుమార్ చెప్పారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు..1000లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - taja news of raids on liquor making centers in visakha
విశాఖ జిల్లా తురువోలు, తంగుడుబిల్లి సరిహద్దులో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు జరిపారు. 1000 లీటర్ల బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేశారు.
polcie raids on natusara centers in visakha dst