విశాఖ పాలిమర్స్ కంపెనీ పరిసర గ్రామాల్లో జీవీఎంసీ సిబ్బంది, గ్రామస్తులు కలసి ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. ప్రధానంగా ఎండిన మొక్కలను, చెట్లను వేళ్లతో సహ తీసేస్తున్నారు. పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మరోవైపు.. ఆర్.ఆర్ వెంకటాపురం వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరిశ్రమ దగ్గర, గ్రామాల్లో, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. బాధిత గ్రామాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పర్యటించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.