ఘనంగా పోచమ్మ తల్లి జాతర ప్రారంభం - పోచమ్మ తల్లి జాతర
విశాఖ జిల్లా నాతవరం గ్రామ దేవత పోచమ్మ తల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఘనంగా పోచమ్మ తల్లి జాతర ప్రారంభం
విశాఖ జిల్లా నాతవరం గ్రామ దేవత పోచమ్మ తల్లి జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఉయ్యాలతో భక్తులు సమీప అడవికి వెళ్లారు. గ్రామానికి చెందిన యువకులంతా ఘటాలతో పూల రాగాలతో కోలాహలంగా ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మంగళవారం అమ్మవారి గుడి వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళలు పసుపు కుంకుమలను సమర్పించి పట్టు వస్త్రాలను అందజేసి మెుక్కులు తీర్చుకుంటారు.